KTR | తెలంగాణలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
కొచ్చిలోని గ్రాండ్ హయత్‌లో జరుగుతున్న ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ 2026లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసెడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సమకాలీన రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు ఉండదని.. గత 26 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదన్నారు.
2014, 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేసింది. ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు. భావజాల పరంగా, సైద్ధాంతికంగా బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకం. అలాంటప్పుడు బీజేపీతో మేమెందుకు పొత్తు పెట్టుకుంటాం..? అన్నారు.
దామాషా ప్రకారం సీట్లు పెంచితేనే మద్దతు..
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు జనాభా ఆధారిత డీలిమిటేషన్ శాపంగా మారుతుందన్నారు . దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా గతంలో సుమారు 24% నుంచి 19%కి తగ్గింది. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే అనేక రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. చట్టసభల్లో సీట్లు పెంచాలనుకుంటే అసెంబ్లీ సీట్లను కూడా ఎందుకు పెంచడం లేదు..? కేవలం పార్లమెంట్ సీట్లను పెంచడంలో ఆంతర్యం ఏమిటి..? ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలకు మహిళా రిజర్వేషన్‌ను ఎందుకు అమలు చేయడం లేదు..? అని ప్రశ్నించారు.
దామాషా ప్రకారం సీట్లు పెంచితేనే మేము మద్దతు ఇస్తాం. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీలను మేము నమ్మలేమని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు ఇచ్చిన అనేక హామీలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా కేంద్రం ఇప్పటివరకు పూర్తిగా అమలు చేయలేదు. కేవలం తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగానే బీజేపీ డీలిమిటేషన్‌ను ముందుకు తీసుకెళ్తోందని మేము భావిస్తున్నామన్నారు కేటీఆర్. అసోం, జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ సీట్లను పెంచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎందుకు పెంచలేదు..? తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయ ప్రభావం తక్కువగా ఉండటం వల్లే సీట్ల పెంపును పట్టించుకోవడం లేదన్న అనుమానాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఢిల్లీ నాయకత్వానికి విధేయుడిగా వ్యవహరిస్తున్నారు కానీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు.
బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. సీజేపీ లాంటి పార్టీతో కలిసి జెన్ జీ, విద్యార్థులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దేశ ప్రజలకు అండగా ఉండడంలో, యువకులతో కలిసి నడవడంలో రాహుల్ గాంధీ విఫలం అయ్యారని అన్నారు.
బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు
సీజేపీ లాంటి పార్టీతో కలిసి జెన్ జీ, విద్యార్థులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు
ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దేశ ప్రజలకు అండగా ఉండడంలో, యువకులతో కలిసి నడవడంలో రాహుల్ గాంధీ విఫలం అయ్యాడు
– కేటీఆర్
Credits–India Today https://t.co/Hurs4bSMtd pic.twitter.com/K9lUk20WdB
— Telugu Scribe (@TeluguScribe) September 30, 2026
Urvashi Rautela | ఊర్వశి రౌతేలా వర్సెస్ ఏఐ కంపెనీ.. రూ.7 వేల కోట్ల దావా, సీఈఓ ఘాటు కౌంటర్‌తో రచ్చ!