అప్పులబాధతో రైతు ఆత్మహత్య
అప్పులబాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలంలో చోటుచేసుకున్నది. దామె ర ఎస్సై వీరభద్రం కథనం ప్రకారం.. సర్వాపూర్‌కు చెందిన బోగి ప్రసాద్ (43) తనకున్న 20 గుంటల భూమితోపాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.
- హనుమకొండ జిల్లాలో విషాదం
నడికూడ, నవంబర్ 26 : అప్పులబాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలంలో చోటుచేసుకున్నది. దామె ర ఎస్సై వీరభద్రం కథనం ప్రకారం.. సర్వాపూర్‌కు చెందిన బోగి ప్రసాద్ (43) తనకున్న 20 గుంటల భూమితోపాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.
పంట పెట్టుబడులు, కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయగా వాటిని తీర్చేందుకు 20 గుంటల భూమిని విక్రయించాడు. అయినప్పటికీ మిగిలిన రూ. 6 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో ఈ నెల 21న ఇంట్లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన భార్య వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

