సర్కార్ స్థలంపై కన్ను
బంజారాహిల్స్ రోడ్ న.ం 10లో సుమారు రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో వెలిసిన ఆక్రమణలను హ్రైడా సిబ్బంది కూల్చేశారు.
- రంగంలోదిగిన హైడ్రా.. ఆక్రమణల తొలగింపు
- స్థలం తమదంటూ ప్రైవేటు వ్యక్తుల దబాయింపు
బంజారాహిల్స్, నవంబర్ 26 : బంజారాహిల్స్ రోడ్ న.ం 10లో సుమారు రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో వెలిసిన ఆక్రమణలను హ్రైడా సిబ్బంది కూల్చేశారు. హెషేక్పేట మండల పరిధిలోని సర్వే నంబర్ 403/పీ, టీఎస్ నంబర్- 1/1/1, బ్లాక్-హెచ్, వార్డు 10లో బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో 1.20 ఎకరాల స్థలాన్ని జలమండలికి ఎన్నో ఏండ్ల కిందటే కేటాయించారు. దాన్ని అనుకుని సుమారు 3.20 ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలం ఉంది.
ఈ స్థలం సర్వే నంబర్ 403/52 కిందకు వస్తుందని, దీన్ని తాను అసలైన యజమానుల వద్ద కొనుగొలు చేశామంటూ పార్థసారథి అనే వ్యక్తితో పాటు ఆయన కుటుంబసభ్యులు ఎన్నో ఏండ్లుగా వాదిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పార్థసారధితో పాటు అతడి అనుచరులపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసులు సైతం నమోదయ్యాయి. ఇదిలా ఉండగా ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు గతంలో పలుమార్లు పార్థసారథి ప్రయత్నించడంతో హైడ్రా రంగంలోకి దిగి స్థలాన్ని స్వాధీనం చేసుకొని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసింది. నాలుగు నెలల కిందట కేబీఆర్ పార్కు చుట్టూ మెఘా ఇంజినీరింగ్ సంస్థ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో హెచ్సిటీ పేరుతో ఫ్లైవోవర్లు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారనే సంగతి తెలిసిందే.
ఈ పనులు నిర్వహిస్తున్న మెఘా సంస్థకు చెందిన యంత్ర పరికరాలు,వాహనాలు , ఇతర సామగ్రిని పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కోరడంతో ఈ స్థలాన్ని రెవెన్యూశాఖ మెఘా సంస్థకు అప్పగించింది. కాగా కొన్నిరోజులుగా గతంలో స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించిన పార్థసారథి, ఆయన కొడుకు విజయ్ తదితరులు ఇటీవల మరోసారి తమ అనుచరులతో స్థలంలో ప్రవేశించారు. ఈ స్థలంపై తమకు కోర్టు ఆదేశాలున్నాయని, మెఘా సంస్థకు చెందిన ప్రతినిధులను దబాయిస్తూ స్థలంలోపల నిర్మాణాలు చేపట్టారు.
రేకుల గదితో పాటు మరికొన్ని నిర్మాణాలు చేపట్టి అక్కడే రాత్రిపూట బౌన్సర్లు, రౌడీలతో పహారా కాస్తున్నారు. అక్కడకు రాత్రిపూట కొంతమంది బడాబాబులు వస్తున్నారని, రాష్ట్ర క్యాబినెట్‌లోని ఓ మంత్రి కుమారుడు సైతం అక్కడకు వచ్చి వెళ్తుంటాడని, ఆ మంత్రి పేరుతో పాటు ఓ కీలక మంత్రికి ఈ స్థలంలో 50శాతం వాటా ఉందంటూ దబాయిస్తుంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మెఘా ఆధీనంలో ఉన్న స్థలంలో తిష్ట వేయడంతో పాటు ఎక్కడపడితే అక్కడ ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు తుడిచివేసి తమ పేర్లను రాసుకున్నారు.
వీరి ఆగడాలు పెరిగిపోవడంతో మెఘా సంస్థ ప్రతినిధులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం హైడ్రా ఇన్స్పెక్టర్ ఆదిత్య ఆధ్వర్యంలో సిబ్బంది ప్రభుత్వ స్థలంలో వెలిసిన ఆక్రమణలను నేలమట్టం చేశారు. ఈ సందర్బంగా స్థలంలోని వ్యక్తులు హైడ్రా సిబ్బందితో వాగ్వాదం దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంజారాహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

