తెలంగాణ- ఏ డివిజన్ లీగ్ కబడ్డీ టోర్నీ షురూ
తెలంగాణ కబడ్డీ సంఘం (టీకేఏ) నిర్వహిస్తున్న తెలంగాణ ఏ డివిజన్ లీగ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కబడ్డీ చాంపియన్‌షిప్ గురువారం మొదలైంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ కబడ్డీ సంఘం (టీకేఏ) నిర్వహిస్తున్న తెలంగాణ ఏ డివిజన్ లీగ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కబడ్డీ చాంపియన్‌షిప్ గురువారం మొదలైంది. మీర్పేట్ మున్సిపల్ క్రీడా మైదానంలోజరిగిన ఆరంభ మ్యాచ్ లో దక్షిణ మధ్య రైల్వే జట్టు 46-25 స్కోరుతో తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్ టీమ్‌పై ఘన విజయం సాధించి శుభారంభం చేసింది.
10 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీని టీకేఏ ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డితో కలిసి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహించడం, వారిలో పోటీతత్వాన్ని, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి. మల్లారెడ్డి, మాజీ కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్ పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

