కమ్మర్పల్లి : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఐసీఐసీఐ ఫౌండేషన్ (ICICI Foundation) ఆధ్వర్యంలో కాలేజీ అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు ఆర్థిక అక్షరాస్యత (Financial Literacy ) పై శనివారం అవగాహన సదస్సును నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పొదుపు, ప్రభుత్వ పథకాలు, జీవిత బీమా, సైబర్ క్రైమ్ మోసాల గురించి ఐసీఐసీఐ ఫౌండేషన్ అభివృద్ధి అధికారి అఖిల, కమ్యూనిటీ ఫెసిలిటేటర్ చింత శ్రీనివాస్ అవగాహన కల్పించారు.
పీఎం ఈజీఈజీపీ, పీఎంఈ ఎల్ఐసీ బీమా, సఖియోజన ,సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ స్కీమ్స్, విశ్వకర్మ యోజన , పీఎం సురక్ష యోజన బీమా, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాయన్న, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.