Arrangements for the parade must be completed

శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ మున్సిపల్ అధికారులకు సూచించారు. సోమవారం బోధన్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ రామలింగం, డీఈఈ లింగంపల్లి శివానందం, పట్టణ సీఐ రమన్తో కలిసి శోభాయాత్ర రూట్‌ను, వినాయకులను నిమజ్జనం చేసే బావులను, పసుపువాగును పరిశీలించారు.మండపాల నిర్వాహకుల సూచన మేరకు రోడ్లపై ఉన్న వ్యర్థాలను తొలగించాలని, గుంతలను పూడ్చాలని సూచించారు.
పసుపువాగుకు భారీ గణపతులు తరలించాలని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయించాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి ఏర్పాట్లను పరిశీలించాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంట అధికారులు, కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, బెంజర్ గంగారాం, శ్రీకాంత్ గౌడ్ , నాయకులు రుద్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.