రెంజల్ : నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలోని రెండు పోలింగ్ కేంద్రాలను (Polling stations ) జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు (Collector Hanmanth) శుక్రవారం తనిఖీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల(Mlc Elections ) నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, వసతులను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అనంతరం మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు . విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్, అధికారులున్నారు.