ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు మరో అవకాశం
రాష్ట్రంలోని ప్లాట్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పెండింగ్లోని లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)ఫీజు చెల్లింపులపై ఏకంగా 25 శాతం భారీ రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
కంఠేశ్వర్, ఏప్రిల్ 30: రాష్ట్రంలోని ప్లాట్ల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. పెండింగ్లోని లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్)ఫీజు చెల్లింపులపై ఏకంగా 25 శాతం భారీ రాయితీని ప్రకటిస్తూ ప్రభుత్వం బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఎల్ఆర్ఎస్ -2020 కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్లాట్ యజమానులకు ఈ వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం 2026 మే 1 నుంచి జూలై 31 వరకు మూడు నెలల కాలంలో ఫీజు చెల్లించే వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. సాధారణ మధ్యతరగతి ప్రజలకు ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తూనే ఏండ్ల తరబడి పెండింగ్లోని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ అరుదైన అవకాశాన్ని ప్లాట్ల యజమానులు సద్వినియోగం చేసుకుని తమ ఆస్తులను క్రమబద్ధీకరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
‘కోతులు, కుక్కల బెడద తీరే వరకు గ్రామ సభ బహిష్కరణ’
HPV Vacchine | భారత హెచ్పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

