పోతంగల్, ఆగస్టు 1: అన్నా భావు సాటే (Anna Bhau Sathe) సేవలు చిరస్మరణీయమని పోతంగల్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యాదవ రావు అన్నారు. శుక్రవారం అన్న భావు సాటే 105వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోనీ బస్టాండ్ వద్ద భావు సాటే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అద్యక్షుడు యాదవ రావు మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకోసం పోరాడిన గొప్ప వ్యక్తి అన్నా భావు సాటే అని కొనియాడారు. సమాజం కోసం ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేశారు. కార్యక్రమంలో జయరాం, నక్కే వారి సాయిలు, లింగం, నరసింహులు, హరి, బాలు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.