ఉమ్మడి జిల్లాలో బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. తీరొక్కపూలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలు కొలువుదీరాయి. తొలిరోజు బుధవారం ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.
మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను అలంకరించారు. సాయంత్రం బతుకమ్మలను ఒకేచోటకు చేరి పాటలతో హోరెత్తించారు.