రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులన్నీ కిక్కిరిసి పోతున్నాయి. దీంతో సీట్లు దొరక్క విద్యార్థులు, ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రమాదమని తెలిసినా తప్పనిసరై ఫుట్‌బోర్డుపై నిల్చుని ప్రయాణం చేయాల్సి వస్తోందని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు.