బోధన్, ఏప్రిల్ 1: ధాన్యం చేతికి వస్తున్న ప్రస్తుత తరుణంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాల

Aiuks
ని, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని డి మాండ్ చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర్ కా ర్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. ధాన్యాన్ని దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని, తూ కంలో మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రైవేట్‌గా అమ్ముకోవడంతో సరైన ధర రాక రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని, వరి పంట కు బోనస్‌ను ప్రలకటించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారాన్ని వెంటనే ప్రకటించాలని, గతేడాది దెబ్బతిన్న పంటలకు కూడా ఇవ్వాలని కోరారు.
అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సబ్ కలెక్టర్ వికాస్ మహతోకు అందజేశారు. ధర్నాలో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గు మ్ముల గంగాధర్, నడిపి నాగన్న, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు పార్వతీ రాజేశ్వర్, రైతు సంఘం బోధన్ మండలం ప్రధాన కార్యదర్శి సుల్తాన్ సా యిలు, నాయకులు కాశ రవి, సిద్ధ పోశెట్టి, శ్రీపతి మల్లేశ్, సుదర్శన్, కిరణ్, మైసయ్య, గోపాల్, గంగాధర్, నరేందర్ పాల్గొన్నారు.