Kamareddy | కామారెడ్డి : కామారెడ్డి సివిల్ సప్లయ్స్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు. శనివారం ఉదయం కలెక్టరేట్‌కు చేరుకున్న ఏసీబీ అధికారులు సాధారణ వ్యక్తుల మాదిరిగా కలెక్టరేట్ మొత్తం తిరిగి గంట తర్వాత సివిల్ సప్లయ్స్ కార్యాలయంలోకి వెళ్లి సిబ్బంది ఫోన్లు తీసుకుని సోదాలు ప్రారంభించినట్టుగా సమాచారం.
కార్యాలయ సిబ్బంది ఏ ఏ విధులు నిర్వర్తిస్తారనే వివరాలు తీసుకుని కార్యాలయంలోని రికార్డులు తనిఖీలు చేపట్టారు. ఆకస్మికంగా నిర్వహించిన ఏసీబీ సోదాల్లో సీఎంఆర్ ధాన్యం విషయంలో ప్రభుత్వానికి బకాయి పడిన రైస్ మిల్లర్ల వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది.