జక్రాన్ పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని పడకల్ జాతీయ రహదారి పై (National Highway) సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road accident) ఇద్దరు మృతి చెందారు. రహదారిపై ట్రాక్టర్ను కంటేనర్ ఢీ కొట్టడంతో డిచ్పల్లి మండలంలోని అమృతపూర్ గ్రామానికి చెందిన రాజేశ్వర్ (30), ఒడ్డెన్న (35) అనే వ్యక్తులు మృతి చెందినట్లు ఎస్సై తిరుపతి (SI Tirupati) తెలిపారు.
జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని ఓ రైతు వ్యవసాయ క్షేత్రం నుంచి జొన్న సొప్ప తీసుకొని తిరిగి అమృతపూర్ వెళ్లే సమయంలో హైదరాబాద్ వైపు వెళుతున్న కంటేనర్ వీరు ప్రయణిస్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగిందని ఎస్సై వివరించారు. తీవ్రంగా గాయపడ్డ వీరిద్దరని నిజామాబాద్ దవాఖాన కు తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.