బాన్సువాడ టౌన్, డిసెంబర్ 25 : మానవ జీవితంలో దైవ చింతనకు ప్రత్యేక స్థానం ఉంటుందని, దైవన్నామస్మరణతో ప్రశాంతమైన జీవనం లభిస్తుందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని గాయత్రి ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరుడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఆలయాలు, ప్రార్థనా మందిరాలు నిర్మించడానికి కోట్లా ది రూపాయల నిధులను మంజూరు చేశామని తెలిపారు. కొన్ని ఏండ్ల క్రితం గాయ త్రి ఆశ్రమ పీఠాధిపతి సుదర్శన దండి స్వామీజీ.. ఆశ్రమం గురించి తనను కలిసినట్లు చెప్పారు.
ఇందుకుగాను గాయత్రి ఆశ్రమం ని ర్మాణం కోసం స్థలం కేటాయించడంతోపాటు అందు లో ఆలయాల నిర్మా ణం కోసం నిధు లు మంజూరు చేసినట్లు చెప్పారు. డీసీసీబీ చైర్మన్ పోచా రం భాస్కర్ రెడ్డి సొంత డబ్బులను విరాళంగా ఇచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ భూషణ్రెడ్డి, బాన్సువాడ, బుడ్మి సొసైటీ చైర్మన్లు కృష్ణారెడ్డి, గంగా రాం, సీనియర్ నాయకులు ఎజాస్, కౌన్సిలర్ లింగమేశ్వర్, తాడ్కోల్ సర్పంచ్ రాజు, బాన్సువాడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అనిత, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.