Nizamabad | పోతంగల్ మే 26: మండలకేంద్రంలో 30 పడుకల ఆసుపత్రి నిర్మించాలని, ఆసుపత్రిలో 24 గంటల వైద్య సేవలు అందించాలని బీజేపీ మండల అధ్యక్షుడు బజరంగ్ హన్మాండ్లు డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల హన్మండ్లు మట్లాడుతూ మండల ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు ప్రభుత్వం మండల కేంద్రానికి 30 పడకల ఆసుపత్రిని నిర్మించాలని అన్నారు.
ప్రస్తుతం ఉన్న ఆరు పడకల ఆసుపత్రిని 30 పడకలకు పెంచడంతో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. గర్భిణీలు డెలివరీ సమయంలో ఇబ్బందులు ఎదురుకోవలసిన పరిస్థితి ఉందని, అన్ని రకాల జబ్బులకు మండల కేంద్రంలో నే 24 గంటలు వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగం సాయిలు, కిరణ్, అశోక్, దత్తు, శ్రీకాంత్, శంకర్, గంధపు హన్మండ్లు తదితులున్నారు.