Tap Connections | కంటేశ్వర్ మార్చి 04 : నల్లా కలెక్షన్లు ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 4వ డివిజన్ మహాలక్ష్మి నగర్ 2 కాలనీ ప్రజలు కోరుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు మాట్లాడుతూ.. తమ కాలనీలో మొత్తం 84 నివాస గృహాలు ఉన్నాయని కానీ.. ఏ ఒక్క గృహానికి నల్లా కనెక్షన్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దాదాపు అన్ని ఇండ్లకు రూ.1000 నుంచి 1500 వసూలు చేసి నల్లా పైపులైన్ కనెక్షన్ ఇచ్చారని నీళ్లు మాత్రం రావడం లేదని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంలేదని ఇప్పటివరకు ఒక రెండు సార్లు కార్పొరేషన్ అధికారులు వచ్చి త్వరలోనే నీటి సరఫరా జరిగేలా చూస్తామని చెప్పారని.. అది కేవలం మాటలకే పరిమితం అయిందని తమ సమస్య మాత్రం అలాగే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా లాభం లేదని నల్లా కనెక్షన్లపై ఆశలు వదులుకున్నామని తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి నీటి సరఫరా జరిగేలా చూడాలని కోరుతున్నారు.

సామినేని అనిల్, కాలనీ వాసి :
కాలనీలో నల్ల పైపులను కనెక్షన్ల కోసం ప్రతి ఇంటి నుండి రూ.1000 నుండి 1500 వసూలు చేశారు. నామమాత్రంగా పైపులను కలెక్షన్ ఇచ్చారు. నల్లా కనెక్షన్ మాత్రం ఇవ్వలేదు. నీరు రావడం లేదు.

శంకర్, మహాలక్ష్మి నగర్ 2 కాలనీ వాసి :
కాలనీలో మొత్తం 84 నివాస గృహాలు ఉన్నాయి. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలని ఎన్నిసార్లు మున్సిపల్ కార్పొరేషన్ లో వినతి ఇచ్చిన ఎవరు పట్టించుకోవడం లేదు. ఒకటి రెండుసార్లు అధికారులు వచ్చి వెళ్లారు అంతేకానీ సమస్య మాత్రం తీరలేదు.
మీడియాకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం : హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు
Madhabi Puri Buch | సెబీ మాజీ చీఫ్‌కు ఊరట.. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన హైకోర్టు
AC Bus Shelter | బోరబండలో ఏసీ బస్ షెల్టర్ కబ్జా.. కిరాయికి ఇవ్వటానికి రెడీస్టు పార్టీ సభ్యులు : ఎస్పీ రోహిత్ రాజు