గులాబీ గుబాళింపు
సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వేల్పూర్ మండలంలోని మోతె గ్రామానికి చెం దిన శివాజీ, అంబేద్కర్, 11 స్టార్, ఫ్రెండ్స్, శ్రీకృష్ణ యాదవ, రాయల్ యూత్ సభ్యులు భీమ్‌గల్ పట్టణ యువకులు సుమారు 300 మంది మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో బుధవారం పార్టీలో చేరారు.
- బీఆర్ఎస్లోకి చేరికల వెల్లువ
వేల్పూర్/మోపాల్ (ఖలీల్‌వాడి)/ డిచ్పల్లి/ నిజామాబాద్ రూరల్/ఆర్మూర్/బోధన్/ఆర్మూర్‌టౌన్/ ఖలీల్‌వాడి,, నవంబర్ 1 : సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వేల్పూర్ మండలంలోని మోతె గ్రామానికి చెం దిన శివాజీ, అంబేద్కర్, 11 స్టార్, ఫ్రెండ్స్, శ్రీకృష్ణ యాదవ, రాయల్ యూత్ సభ్యులు భీమ్‌గల్ పట్టణ యువకులు సుమారు 300 మంది మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో బుధవారం పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో..
బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు మద్దతు తెలుపుతూ బీఆర్ఎస్లో చేరారు. మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామానికి చెందిన ఆదివాసీ నాయక్‌పోడ్ సంఘం ఆధ్వర్యంలో సుమారు 30 కుటుంబాలు సర్పంచ్ సిద్ధార్థ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరగా.. బాజిరెడ్డి గోవర్ధన్ వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు 42 మంది బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. రూరల్ మండలంలోని రాంనగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు 28 మంది ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంపీటీసీ అంశాల నీరజాస్వామి, మైనార్టీ నాయకుడు అక్బర్ నవాజుద్దీన్ ఆధ్వర్యంలో వీరు పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో..
ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలోని ఎమ్మెల్యే నివాసంలో నందిపేట మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నర్సాగౌడ్, ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామానికి చెందిన అల్లెపు బుచ్చిరాజు, మహిళలు బుధవారం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి జీవన్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. కార్యక్రమంలో మార్క్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నాయకులు ఖాందేశ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. పెర్కిట్‌కు చెందిన మైనార్టీ యూత్ సభ్యులు, మార్కెట్ వ్యాపార సమూదాయ యజమానులు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సమక్షంలో పారీలో చేరారు.
ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆధ్వర్యంలో..
బోధన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు చెందిన మాజీ కౌన్సిలర్లు డి.శ్రీనివాస్‌రావు, జి.శేఖర్‌తోపాటు ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాంబాబుతోపాటు నాగులు, నయీం ఆ పార్టీకి రాజీనామాచేసి బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే షకీల్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్లో బోధన్ పట్టణంలో పాటు వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు.
అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో
అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు, నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్ బుధవారం బీఆర్ఎస్లో చేరారు. నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు బహుజన కాలనీకి చెందిన సుమారు 500 మంది పార్టీలో చేరారు. గోల్ హనుమాన్ వైశ్య సంఘం అధ్యక్షుడు, జెండా బాలాజీ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ చిన్నగంగారాం పార్టీలో చేరగా.. బిగాల గణేశ్ గుప్తా గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

