గత పాలకుల హయాంలో అడుగడుగునా కరెంటు కోతలతో అన్ని వర్గాల ప్రజలు పడిన బాధలు వర్ణణాతీతం. చాలామంది చిరు వ్యాపారులు నష్టాలపాలై వ్యాపారాలను సైతం మూసుకున్న పరిస్థితులు.. కానీ కేసీఆర్ అధికారం చేపట్టిన అనంతరం కరెంటు కష్టాలకు చరమగీతం పాడారు. రాష్ట్రంలో కోతల్లేని కరెంటు సరఫరా అవుతుండడంతో అన్ని వర్గాల వారికి మేలు చేకూరుతున్నది. పరిశ్రమలు, వ్యాపారులు, రైతులకు రంది లేకుండా పోయింది. కాంగ్రెస్ మాటలు నమ్మితే మళ్లీ అంధకారమే మిగులుతుందని.. సీఎం కేసీఆర్‌కే అండగా నిలవాలని అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
కాంగ్రెస్ పాలకుల హయాంలో కరెంటు కష్టాలను అన్ని వర్గాల ప్రజలు అనుభవించారు. కరెంటు ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెల్వక.. విసిగిపోయేవారు. కరెంటుసాయంతోనే వ్యాపారాలు నిర్వహించేవారు అప్పు చేసైనా.. తప్పనిసరిగా జనరేటర్లు కొనిపెట్టుకునేవారు. లేదంటే గిరాకీ ఉండేది కాదు. కరెంటు లేక.. ఉక్కపోత భరించలేక పట్టణాల్లో కొందరు ఇండ్లల్లో ఇన్వర్టర్లు పెట్టుకునేవారు. ఇక రైతుల కష్టాలైతే చెప్పాల్సిన పనిలేదు. పంటలకు నీరు పారించాలంటే కరెంటు కోసం రోజూ జాగారం చేయాల్సిందే. ఇప్పుడా పరిస్థితులన్నీ మారిపోయాయి. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక అనతికాలంలోనే తెలంగాణ ప్రజలకు కరెంటు కష్టాలను దూరం చేశారు. 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. మళ్లీ పాతరోజులు రావొద్దన్ని కోరుకుంటున్నారు.
-చందూర్/దోమకొండ, ఆగస్టు 20
కరెంటు బాధలు పోయినయ్..
చందూర్: ఒకప్పుడు పొలాలకు నీరు పెట్టాలంటే తెల్లందాక, పొద్దుందాక అక్కడనే పండుకునెటోళ్లం. కరెంటు కోసం ఎదురుచూసి మోటర్ ఏస్తుంటిమి. ఇప్పుడా బాధలు పోయినయ్.. ఇప్పుడు చందూర్ గ్రామంలో వాటర్ ప్లాంట్ నడుపుతున్న. మా ఊరిలో ఏదైనా రిపేర్ ఉంటే తప్ప.. పైనుంచి కరెంటు పోతలేదు. ఊరోళ్లకు ఎప్పుడంటె అప్పుడు నీళ్లు పట్టిస్తున్న.
-షేషుగారి గోపాల్‌రెడ్డి, వాటర్ ప్లాంట్ నిర్వాహకుడు, చందూర్
రైతులపాలిట ఆత్మబంధువు కేసీఆర్
దోమకొండ: ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతుల పాలిట ఆత్మబంధువు. ఆయన పాలనలో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది. గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల తలరాతలు మారలేదు. ఇప్పుడు కేసీఆర్ రైతుల పక్షాన నిలబడ్డారు. ఉచిత విద్యుత్‌తో బీడుభూములను కూడా సాగుచేసుకునే అవకాశం కల్పించారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంతో ఉందంటే ఆయన కృషే.
-ద్యార బాల్‌రాజు, రైతు, శేరిబీబీపేట
గతంలో ఎన్నో కరెంటు కష్టాలు చూసినం..
దోమకొండ: గతం పాలకుల హయాంలో ఎన్నో కరెంటు కష్టాలు అనుభవించాం. కరెంటు ఎప్పుడు వస్తోందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. పంటలకు నీరు పారించాలంటే రోజూ జాగారమే. శివార్లల్ల బిక్కుబిక్కుమంటూ నిద్రలేని రాత్రులు గడిపినం. కేసీఆర్ పాలనలో కరెంటు కష్టాల నుంచి బయట పడ్డాం. మళ్లీ పాతరోజులు రావొద్దు.
-దేవరాజు, రైతు, దోమకొండ
జనరేటర్‌తో జిరాక్స్ సెంటర్ నడిపినం..
చందూర్: నా చిన్నప్పటి నుంచి మా నాన్న జిరాక్స్ సెంటర్ నడుపుతున్నడు. అప్పుడు కరెంటు సరిగా ఉండేది కాదు. గిరాకీ వాపస్ పోతుండె. జనరేటర్ పెట్టుకొని జిరాక్స్ తీస్తుంటిమి. ఇప్పుడు నేనే షాపు నడిపిస్తున్న. తెలంగాణ ప్రభుత్వం వచ్చినంక కరెంటు కోతలు అసలే లేవు. ఇప్పడు ఏ షాపు దగ్గర కూడా జనరేటర్లు కనిపిస్తలేవు. అదనంగా పెట్టుబడులు తప్పినయ్.
-సుధీర్, జిరాక్స్ సెంటర్ యజమాని, చందూర్
దేశంలో ఆదర్శం తెలంగాణ
దోమకొండ: దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు కరెంటు కష్టాలను దూరం చేసింది. ఒకప్పుడు వ్యవసాయం దండుగ అనెటోళ్లు. ఇప్పుడు పండుగలెక్క మారింది. రైతులకు కేసీఆర్ అన్ని విధాలా అండగా నిలబడి రాజును చేసిండు. తెలంగాణను నంబర్‌వన్ చేసిండు.
-నేతుల శ్రీనివాస్‌యాదవ్, రైతు దోమకొండ
రైతుల పాలిట దేవుడు..
దోమకొండ: కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కరెంటు కోతలు పూర్తిగా పోయాయి. ఇండ్లకు, పంటలకు 24 గంటలు కరెంటు ఇస్తున్నారు. వ్యవసాయానికి ఉచితంగా కరెంటు సరఫరా చేయడంతో ఏటా రెండు పంటలు పండిస్తున్నాం. అన్నదాల కష్టాలన్నీ దూరమయ్యాయి. కేసీఆర్ రైతుల పాలిట దేవుడు.
-రాజయ్య, రైతు, చింతమాన్‌పల్లి
ఆత్మవిశ్వాసం పెరిగింది..
దోమకొండ: వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచితంగా కరెంటు సరఫరా చేయడంతో రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. గత పాలకుల తీరుతో చాలా మంది వ్యవసాయానికి దూరమయ్యారు. సరిగా కరెంటు లేక.. పంటలకు నీరు పారక ఎండిపోయి అప్పుపాలయ్యారు. రైతుల దశ మార్చిన కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
-ఆకుల సిద్దరాములు, సీతారాంపూర్
కరెంటు పోతలేదు..
చందూర్: ఇంతకుముందు నేను వడ్రంగి పనిచేసే వాడిని. అప్పుడు ఆరు గంటలే కరెంటు ఇస్తుండె. కట్టెలు కొయ్యడానికి కరెంటు కోసం రాత్రంగా ఎదురుచూస్తుంటిమి. సరిగా నిద్ర ఉండేంది కాదు. ఆ పని మంచిగ లేక ఇప్పుడు పిండి గిర్ని పెట్టుకున్న. బాగా నడుస్తున్నది. తెలంగాణ వచ్చినంక కరెంటు పోతనేలేదు. గిరాకీ ఎప్పుడస్తే అప్పుడు పిండి పట్టి ఇస్తున్న. నా చిన్నప్నుడు పండుగులు వస్తే పిండి పట్టించుకునేందుకు పదిసార్లు గిర్నికి తిరుగుతుంటిమి.
-మహేశ్, పిండిగిర్ని యజమాని, చందూర్