పదేండ్ల పాలనలో నిరంతరం.. నిర్విఘ్నంగా
పదేండ్ల కేసీఆర్ పాలనలో నిర్విఘ్నంగా విద్యుత్ సరఫరా అయ్యేది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన కరెంటు ఇబ్బందులను స్వరాష్ట్రంలో కేసీఆర్ పరిష్కరించిండు. రెప్పపాటు కూడా కరెంటు కోత లేకుండా చూసిండు. రైతులకు, ఇండ్లల్లో నాణ్యమైన కరెంటు ఇచ్చిండు.
- కేసీఆర్ హయాంలోనే 24గంటల కరెంటు
- ఉచిత విద్యుత్తుతో కులవృత్తులకు పూర్వవైభవం
- బీఆర్ఎస్ పాలనలో నాణ్యమైన కరెంటు
పదేండ్ల కేసీఆర్ పాలనలో నిర్విఘ్నంగా విద్యుత్ సరఫరా అయ్యేది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన కరెంటు ఇబ్బందులను స్వరాష్ట్రంలో కేసీఆర్ పరిష్కరించిండు. రెప్పపాటు కూడా కరెంటు కోత లేకుండా చూసిండు. రైతులకు, ఇండ్లల్లో నాణ్యమైన కరెంటు ఇచ్చిండు. రజక, నాయీబ్రాహ్మణ కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు 250యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా చేసిండు. సబ్స్టేషన్లను పెంచి, అదనంగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను కేసీఆర్ మంచిగ చేసిండు.. అని ఉమ్మడి జిల్లా ప్రజలు, రైతులు, కులవృత్తిదారులు చెబుతున్నారు. కరెంటు రందిని తీర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడుతున్నారు.
కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..
పొతంగల్, జూన్ 24: కేసీఆర్ పాలనలో కరెంటు సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండె. రెప్పపాటు కూడా కరెంటు పోయేది కాదు. కులవృత్తులు చేసుకునేటోళ్లను ఆదుకున్నడు. రజక, నాయీబ్రాహ్మణులను దృష్టిలో ఉంచుకొని 250యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇచ్చిండు. కేసీఆర్ సారు కృషితోనే ఫ్రీ కరెంటుతో ఇస్త్రీ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాం. ఇంత చేసిన కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– పద్మ, హంగర్గఫారం
పదేండ్ల ముందు మస్తు తిప్పలైంది..
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయానికి రాత్రిపూట కరెంటు వచ్చేది. అప్పుడు మస్తు తిప్పలైంది. రాత్రిపూట మోటర్ల దగ్గరే పడుకొనేవాళ్లం. కేసీఆర్ హయాంలో పదేండ్లు కరెంటు ఫుల్లుగా వచ్చింది. రంది లేకుండా చేసిండు. ఇప్పుడు మళ్లీ పాతరోజులు వచ్చేటట్లు కనిపిస్తున్నయ్. పంటలు వేసుకున్న తర్వాత సక్కగ కరెంటు ఇయ్యకపోతే మా పరిస్థితి ఎట్లనో ఏమో. తలుచుకుంటెనే భయమేస్తున్నది.
– దొడ్డిమీద శేఖర్, రైతు
పదేండ్లలో కరెంటు కోతలు లేవు..
పొతంగల్, జూన్ 24: ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎంగా పదేండ్లపాటు కేసీఆర్ కరెంటు మంచిగ ఇచ్చిండు. లోవోల్టేజీ సమస్య లేకుండా చేసిండు. కరెంటు బాధలు తీర్చిండు. పరిశ్రమలు, వ్యవసాయానికి కచ్చితంగా కరెంటు అవసరమని, ఎంత ఖర్చయినా వెనుకాడకుండా ఎక్కడ కరెంటు అందుబాటులో ఉంటే అక్కడ నుంచి కొని.. 24గంటలు కరెంటు ఇచ్చిండు.
– ముజీబుల్ రహమాన్, పిండిగిర్నీ యజమాని, హంగర్గఫారం
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

