ఆదివారం 24 జనవరి 2021
Nizamabad - Dec 21, 2020 , 00:43:35

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

నిజామాబాద్‌ జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ రజితాయాదవ్‌ 

కోస్లి వద్ద అలీసాగర్‌ నీటి విడుదల 

ఆరు మండలాల్లో 53 వేల ఎకరాలకు లబ్ధి 

నవీపేట: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నదని నిజామాబాద్‌ జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ రజితాయాదవ్‌ అన్నారు. నవీపేట మండలంలోని కోస్లి గోదావరి ఫస్ట్‌ స్టేజీ వద్ద స్థానిక ఎంపీపీ సంగెం శ్రీనివాస్‌తో కలిసి అలీసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బోధన్‌ ఎమ్మెల్యే మహ్మద్‌ షకీల్‌ ఆదేశాల మేరకు యాసంగి పంటల సాగు కోసం అలీసాగర్‌ నుంచి నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. అలీసాగర్‌ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో 53 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. రైతులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వి.నర్సింగ్‌రావు, వైస్‌ ఎంపీపీ హరీశ్‌, ప్రాజెక్టు ఏఈ ప్రణయ్‌రెడ్డి, సర్పంచ్‌ నీలేశ్‌కుమార్‌, తాడ్‌బిలోలి లిఫ్ట్‌ చైర్మన్‌ మౌలానా, రెంజల్‌ ఏఈ షరీఫ్‌, మాజీ సర్పంచ్‌ ముత్యం, టీఆర్‌ఎస్‌ నాయకులు జగన్‌, సాయిలు, యాదవ్‌, రైతులు పాల్గొన్నారు.


logo