మంగళవారం 01 డిసెంబర్ 2020
Nizamabad - Oct 25, 2020 , 00:46:21

సంబురంగా సద్దుల పొద్దు

సంబురంగా సద్దుల పొద్దు

సందెవేళ సద్దుల సంబురం అంబరాన్నంటింది. తొమ్మిదిరోజుల పాటు అక్కాచెల్లెళ్లు ఎంతో ఆనందంగా జరుపుకొన్న బతుకమ్మ సంబురాలు శనివారం నిర్వహించిన సద్దుల బతుకమ్మతో ముగిశాయి. తీరొక్కపూలతో  బతుకమ్మలను పేర్చిన ఆడపడుచులు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో తమ ఆటపాటలతో సంప్రదాయపండుగను వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్‌ నగరంలోని హమాల్‌వాడి, రఘునాథచెరువు, సుభాష్‌నగర్‌ రామాలయం తదితర ప్రాంతాల్లో సద్దుల బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు ఎల్లారెడ్డి, జుక్కల్‌ తదితర ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. 

- ఖలీల్‌వాడి/విద్యానగర్‌