ఆదివారం 31 మే 2020
Nizamabad - Feb 28, 2020 , 00:14:00

ధార్మిక కేంద్రంగా కందకుర్తి

ధార్మిక కేంద్రంగా కందకుర్తి

రెంజల్‌: ధార్మిక కేంద్రంగా కందకుర్తి విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నదని హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి అన్నారు. రెంజల్‌ మండలం కందకుర్తి గ్రామాన్ని గురువారం సందర్శించారు. రామాలయం ముందు నిర్మాణంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి, విఠల్‌ రుక్మిణీ బాయి గుడి పనులను విద్యారణ్య భారతీ స్వామి పరిశీంచారు. మూడు నదు లు ఒకే చోట కలిసి కందకుర్తి పవి త్ర పుణ్య క్షేత్రంగా త్రివేణి సంగమ క్షేత్రంగా ఆలయ నిర్మాణం పూర్తయితే  గ్రామం ధార్మిక కేంద్రంగా మంచి గుర్తింపు పొందుతుందని అన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ ధైవ చింతన నిత్యం పాటించాలన్నారు. యువత పెడదారి పట్టకుండా ధార్మికకార్యం వైపు దృష్టి సారించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. సుబ్రహ్మణ్య స్వామి, విఠల్‌ రుక్మిణి బాయితోపాటు గుడి వద్ద  నవగ్రహాలు, ధ్వజ స్తంభం నిర్మాణం చేయాలని చెప్పారు. మహిళలు మంగళ హారతులతో విద్యారణ్య భారతీ స్వామికి ఘన స్వగతం పలికారు. కేశవ స్మృతి మందిరం, రామాలయాన్ని దర్శించారు. భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానికులు, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.logo