మాక్లూర్ , ఆగస్టు 28 : కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం పోడు పట్టాలను మంజూరు చేసిందని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్, మామిడిపల్లి, మదన్‌పల్లి, వేణుకిసాన్నగర్ గ్రామాలకు చెందిన 20 మంది గిరిజన రైతులకు సోమవారం రాత్రి ఎమ్మెల్యే పోడు భూములకు సంబంధించిన పట్టాలను పంపిణీ చేశారు. చిన్నాపూర్కు చెందిన ఇద్దరు, మామిడిపల్లికి చెందిన ఐదుగురు, మదన్‌పల్లికి చెందిన ఒకరు, వేణుకిసాన్నగర్ తండాకు చెందిన 12 మందికి పట్టాలు మంజూరయ్యా యి. పట్టాలు అందుకున్న గిరిజనులు ..సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అంకాపూర్లోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఆర్మూర్, ఆగస్టు 28: గుజరాత్, రాజస్థాన్ నుంచి వచ్చి ఆర్మూర్‌లో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్న యజమానులు, పెర్కిట్‌కు చెందిన యాదవ, నాయిక్‌పోడ్, మైనార్టీలు సోమవారం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోచేరిన వారికి ప్రాధాన్యం ఇస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినితా పవన్, వైస్ చైర్మన్ షేక్ మున్నా, కౌన్సిలర్ గంగామోహన్‌చక్రు, బీఆర్ఎస్ నాయకులు జీజీ రాం, నచ్చు చిన్నారెడ్డి తదితరులు పా ల్గొన్నారు.
ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు దర్శించుకోవడానికి స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇందులోభాగంగా నందిపేట మండలం వన్నెల్ (కే) గ్రామస్తులు సోమవారం తరలివెళ్లారు. వన్నెల్ (కే) నుంచి గామస్తులను ప్రత్యేక బస్సులో ఆర్మూర్‌లోని నవనాథ సిద్దులగుట్టకు తరలించి దర్శనం చేయించారు. అనంతరం వారిని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రత్యేక బస్సు ల్లో యాదాద్రికి దగ్గరుండి పంపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, సీనియర్ నాయకులు పండిత్ పవన్, ఖాందేశ్ శ్రీనివాస్, లింబాద్రిగౌడ్, పోల సుధాకర్, జనార్దన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.