Nominations | పోతంగల్, నవంబర్ 27: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణలో భాగంగా ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలలో తొలిరోజు మండలంలోని 20 గ్రామపంచాయతీలకు గాను గురువారం సర్పంచ్ పదవులకు 14 నామినేషన్లు దాఖలు అయ్యాయని ఎంపీడీవో చందర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో వివరాలను వెల్లడించారు. సోంపూర్-1, సుంకినీ-5, కొల్లూర్-1, చేతన్ నగర్-1, భాకరఫారం-1, జల్లాపల్లి-1, కల్లూర్-1, జల్లాపల్లి ఫారం-2, పోతంగల్-1 నామినేషన్లు దాఖలైనట్లు వివరించారు.