కామారెడ్డి : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 5వ తేదీన జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పది వేల మందిని తరలించాలని ప్రభుత్వ విప్ గోవర్ధన్ అన్నారు. జన సమీకరణ కోసం ప్రభుత్వ విప్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకలతో సమావేశం నిర్వహించారు.
కార్యక్రమంలో అలాగే ఎంవీఐ, ఐకేపీ, అధికారులతో సమీక్షించారు.
కాగా, నూతన కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు. సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకే ముజీబుద్దీన్, జిల్లా గ్రంథలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, రాష్ర్ట నాయకులు నిట్టు వేణుగోపాలరావు, పిపిరి వెంకట్, ఎంపీపీలు ఆంజనేయులు, గాల్ రెడ్డి, శారద, మండల పార్టీ అధ్యక్షులు వున్నారు.