e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home కామారెడ్డి ‘హాక్‌ ఐ’తో పట్టేస్తున్నారు..

‘హాక్‌ ఐ’తో పట్టేస్తున్నారు..

  • పోయిన ఫోన్ల ఆచూకీని గుర్తిస్తున్న ఐటీ సెల్‌
  • ఇప్పటి వరకు 535 ఫోన్ల రికవరీ

సిటీబ్యూరో, జులై 20 (నమస్తే తెలంగాణ): సెల్‌ఫోన్‌ పోయిందా.. ఇక నో టెన్షన్‌. పోయిన ఫోన్లను ఐఎంఈఐ నంబర్‌ సాయంతో పోలీసులు రికవరీ చేస్తున్నారు. నిర్లక్ష్యం, ఇతర కారణాలతో పలువురు ఫోన్లు పోగొట్టుకుంటుండగా వాటి ఆచూకీ తెలుసుకునేందుకు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లోని ఐటీ సెల్‌ ఆధ్వర్యంలో ట్రేసింగ్‌ చేస్తున్నారు. ఫోన్లను రికవరీ చేసేందుకు ‘హాక్‌ ఐ’ మొబైల్‌ అప్లికేషన్‌ సామాన్యులకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. ఐఎంఈఐ నంబర్‌తో ఫిర్యాదు చేస్తే.. ఆ ఫోన్‌ను ఎవరైనా వాడితే తప్పక దొరికే అవకాశం ఉంటుందని పోలీసులు వివరిస్తున్నారు.

ట్రేసింగ్‌ ఇలా..
సాధారణంగా ఫోన్‌ పోగొట్టుకున్న వారు పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అక్కడి పోలీసులు ‘హాక్‌ ఐ’ అప్లికేషన్‌ ద్వారా ఫిర్యాదు తీసుకుంటున్నారు. అనంతరం అప్లికేషన్‌లోని లాస్డ్‌ రిపోర్టు ఆప్షన్‌ ద్వారా సెల్‌ఫోన్‌కు సంబంధించి ఐఎంఈఐ నంబర్‌తో అది ఎక్కడ పోయిందో గుర్తిస్తారు. అలా సేకరించిన సమాచారాన్ని ఐటీ సెల్‌ స్థానిక పోలీసులకు అందిస్తుండడంతో వారు ఫోన్లను రికవరీ చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు మొత్తం 535 ఫోన్లను రికవరీ చేశారు.

- Advertisement -

నా ఫోన్‌ దొరికింది..
డిసెంబర్‌లో నేను ఫోన్‌ పోగొట్టుకున్నా. సంతోష్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే అక్కడి పోలీసులు ‘హాక్‌ ఐ’ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా ఫిర్యాదు తీసుకున్నారు. అయితే ఇటీవల నాకు పోలీసుల నుంచి ఫోన్‌ వచ్చింది. పోయిన ఫోన్‌ దొరకడంతో సీపీతో ఇప్పించగా సంతోషం వేసింది.

  • రమేశ్‌కుమార్‌, ఉప్పుగూడ

25 వేల ఫోన్‌ తెచ్చి ఇచ్చారు..
బ్యాగులోని నా ఫోన్‌ ఎక్కడో పడిపోయింది. వెంటనే చూసుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ‘హాక్‌ ఐ’ ద్వారా గుర్తించారు. రెండు మూడు రోజుల తర్వాత రూ.25 వేల ఫోన్‌ను పోలీసులు తెచ్చి ఇచ్చారు.

  • అయేష హమ్మద్‌, బోయిన్‌పల్లి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana