రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంతో పల్లెలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదం పంచుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ పరిసరాలు పచ్చదనం సంతరించుకున్నాయి.
వేసవిలో మొక్కలు, చెట్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో అవి ఏపుగా పెరిగి పచ్చని వనాలను తలపిస్తున్నాయి. కలెక్టరేట్ ఆవరణలో పరుచుకున్న పచ్చదనం సందర్శకులకు కనువిందు చేస్తున్నది.
-స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్