ఖలీల్‌వాడి, ఏప్రిల్ 1: ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభకృత్ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో శుభాల ను తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలంతా ధైర్యంగా జీవితంలో ముందడుగు వేయాలని తెలిపారు. తెలుగు వారంతా శుభకృత్ నామ సంవత్సరంగా జరుపుకొంటే తెలంగాణ యువత ఉద్యోగనామ సంవత్సరంగా చేసుకుంటున్నారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ 90వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తుండడంతో యువత సన్నద్ధమవుతున్నారని తెలిపారు.
రాష్ట్రం మరింత ప్రగతి సాధించాలి..
– మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
వేల్పూర్, ఏప్రిల్ 1: ఉమ్మడి జిల్లా ప్రజలకు రాష్ట్ర రోడ్లు-భవనాలు,హౌసింగ్,శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ మరింత ప్రగతి సాధించాలని కోరుకుంటున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలి..
-సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి
బీర్కూర్, ఏప్రిల్ 1: రాష్ట్ర ప్రజలకు శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలను తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా పంటలు పండాలని ఆకాంక్షించారు.
పాడిపంటలతో కళకళలాడాలి : డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి
బాన్సువాడ, ఏప్రిల్ 1: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలు, రైతులకు డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి శుభకృత్ నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలను శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడిపంటలు కళకళలాడాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
అందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలి
జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు
నిజామాబాద్‌సిటీ, ఏప్రిల్ 1: శుభకృత్ నామ సంవత్సరం పురస్కరించుకొని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పాడిపంటలు కళకళలాడాలని, అందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని ఆకాంక్షించారు.
శాంతియుతంగా జరుపుకోవాలి : సీపీ
నిజామాబాద్ క్రైం, ఏప్రిల్ 1: శుభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ప్రజలకు సీపీ నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
సకల శుభాలు చేకూరాలి..
నిజామాబాద్‌సిటీ, ఏప్రిల్ 1: శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరికీ శు భాలు చేకూరాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆకాంక్షించారు. అందరి జీవితాల్లో ఆనందోత్సాహోలు నింపాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు.
కలెక్టర్ నారాయణరెడ్డి