శుక్రవారం 05 మార్చి 2021
Nirmal - Jan 26, 2021 , 00:06:26

రూర్బన్‌తో గ్రామాల అభివృద్ధి

రూర్బన్‌తో గ్రామాల అభివృద్ధి

  • పల్లెల్లో పట్టణస్థాయి సౌకర్యాలు
  • ముథోల్‌ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి
  • కలెక్టర్‌తో కలిసి కుంటాలలో పర్యటన
  • పలు అభివృద్ధి పనులకు భూమి పూజ

కుంటాల, జనవరి 25 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూర్బన్‌ పథకం ద్వారా గ్రామాల్లో పట్టణస్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ముథోల్‌ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీతో కలిసి మండలంలో పర్యటించారు. లింబా(కె), కుంటాల, అంబకంటి, అందకూర్‌లో రూ.80 లక్షలతో అంగన్‌వాడీ భవనాలు, అంబకంటి, అందకూర్‌లో రూ.80 లక్షలతో ఐదువేల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం గల గోదాముల నిర్మాణాలకు భూమి పూజచేశారు. కల్లూర్‌లో రూ.1.2 కోట్లతో నిర్మించనున్న చెక్‌డ్యామ్‌ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో రూర్బన్‌ పథకానికి కుంటాల మండలాన్ని ఎంపిక చేసి, అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. మలి విడుతలో విజయ పాలకేంద్రంతో పాటు పాఠశాలల ప్రహరీ నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కలెక్టర్‌ను ప్రజాప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో సీడీపీవో నాగలక్ష్మి, ఎంపీపీ గజ్జారాం, జడ్పీటీసీ కొత్తపల్లి గంగామణి, ఆత్మ, ఏఎంసీ, సొసైటీ చైర్మన్లు అశోక్‌ రెడ్డి, రవీందర్‌ రెడ్డి, సట్ల గజ్జారాం, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ పడకంటి దత్తు, ఎంపీటీసీలు మధు, లింగాదాస్‌, సునంద, సర్పంచ్‌లు ముజిగే ప్రవీణ్‌, దాసరి కిషన్‌, దొనికెన సమత, బాపురావ్‌, శంకర్‌, మల్లేశ్‌, హైమద్‌, లక్ష్మీబాయి, ఆనంద్‌రావ్‌, ఏఎంసీ డైరెక్టర్లు భోజన్న, సబ్బిడి గజేందర్‌, వెంకటేశ్‌, దశరథ్‌, తహసీల్దార్‌ శ్రీధర్‌, ఎంపీడీవో దేవేందర్‌ రెడ్డి, ఏవో సోమలింగారెడ్డి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ లక్ష్మీ విశారద, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

గడువులోగా పూర్తి చేయాలి..

అనంతరం కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అంబకంటి, కుంటాల, అందకూర్‌లో పర్యటించారు. అంబకంటిలో అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులను గడువులోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మార్చి 15వ తేదీలోగా రూర్బన్‌ పనులు పూర్తిచేయాలన్నారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి చొరవతో ఈ ఆర్థిక సంవత్సరం మండలానికి రూ.9 కోట్లు మంజూరయ్యాయని వెల్లడించారు. ఆయన వెంట తహసీల్దార్‌ శ్రీధర్‌, ఎంపీడీవో దేవేందర్‌ రెడ్డి, ఏపీవో నవీన్‌, ఎంపీవో ప్రసాద్‌, అధికారులు, ప్రజాప్రతినిధులున్నారు.

VIDEOS

logo