ఆదివారం 07 మార్చి 2021
Nirmal - Jan 20, 2021 , 01:58:45

ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ విద్యను సద్వినియోగం చేసుకోవాలి

నిర్మల్‌ టౌన్‌, జనవరి 19 : ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అన్నారు. జిల్లా గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 2021-22 సంవత్సరానికిగాను బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్‌ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను లక్కీడ్రా ద్వారా కలెక్టరేట్‌లో మంగళవారం ఎంపిక చేశారు. మొత్తం 14 మంది విద్యార్థులను ఎంపిక చేసిట్లు తెలిపారు. వీరికి గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కార్పొరేట్‌స్థాయి విద్యనందించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

క్యాలెండర్‌ విడుదల 

మైనార్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యం లో రూపొందించిన 2021 క్యాలెండర్‌, డైరీని  కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ విడుదల చేశారు. కార్యక్రమంలో మైనార్టీ ఉద్యోగుల సంఘం నాయకులు ముస్తాక్‌బేగ్‌, షబ్బీర్‌ అలీ, ఖలీమొద్దీన్‌, సిరాజొద్దీన్‌, అన్సర్‌, ఆరిఫ్‌, మొహినొద్దీన్‌ పాల్గొన్నారు. 

VIDEOS

logo