ఓటీపీతో రేషన్

- వచ్చేనెల నుంచి సరికొత్త విధానం
- ఇప్పటికే ఐరిస్, వేలిముద్రల ద్వారా పంపిణీ
- వీటితో ఇబ్బందులు పడే వారికి ఉపశమనం
- వృద్ధులకు, ఇతరులకు తొలగనున్న ఇక్కట్లు
- ఉమ్మడి జిల్లాలో 7,44,361 రేషన్ కార్డులు
నిర్మల్ అర్బన్: జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీని ప్రభుత్వం మ రింత పక్కాగా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తం గా రేషన్ బియ్యం ఇతర రాష్ర్టాలకు రవాణా అవుతుందన్న ఆరోపణ ల నేపథ్యంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బోగస్ రేషన్ కార్డులను ఏరివేసేందుకు బయోమెట్రిక్, ఐరిస్ విధానాన్ని అమలు పర్చడంతో ప్రతీ నెల కొన్ని వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఆదా అవుతున్నది. సరైన లబ్ధిదారులకు రేషన్ బియ్యం అం దాలనే ఉద్దేశంతో వేలిముద్రలు సరిగ్గా లేని లబ్ధిదారులకు, ఐరిష్ రాని వారికోసం స్థానిక వీఆర్ఏ, వీఆర్వోల ద్వారా వీరికి రేషన్ బియ్యం సరఫరా చేసేది. దీంతో అధికారుల కోసం వృద్ధులు ప్రతి రోజూ రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు కాసేవారు. ఇప్పుడు అలాంటి విధానా నికి ప్రభుత్వం చెక్ పెట్టి ఓటీపీ ద్వారా బియ్యం పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా డిసెంబర్ నుంచి ఈ విధానానికి శ్రీకారం చుట్టనున్నది. ఇప్పటికే నిర్మల్ జిల్లాలో రెండు నెలల నుంచి ఓటీపీతో రేషన్ బియ్యాన్ని డీలర్లు పంపిణీ చేస్తున్నారు.
డిసెంబర్ నుంచి..
పేద ప్రజలకు పకడ్బందీగా రేషన్ బియ్యం పంపిణీ చేసేలా అనేక చర్యలు చేపట్టినప్పటికీ అక్రమార్కులు రేషన్ దందాను వదలడం లేదు. ఏదో ఒక విధంగా రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలు మహారాష్ట్రకు సరిహద్దు ప్రాంతాలుగా ఉండడంతో అధికారుల కళ్లు గప్పి గంట వ్యవధిలో రాత్రికి రాత్రే సరిహద్దులు దాటిస్తున్నారు. రేషన్ అక్రమ రవాణాకు రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకట్ట వేసేందుకు డిసెంబర్ నెల నుంచి వేలిముద్రలు, ఐరిస్ రాని వృద్ధులకు ఓటీపీ ద్వారా రేషన్ అందించనున్నారు. రేషన్ లబ్ధిదారులు ఆయా రేషన్ దుకాణంలో సరుకులు తీసుకునేందుకు వెళ్లిన స మయంలో రేషన్ కార్డు నంబర్‌ను నమోదు చేయగానే, ఆధార్ రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దీని ద్వారా లబ్ధిదారులకు రే షన్ సరుకులను అందించనున్నారు.
ఉమ్మడి జిల్లాలో 7,44,361 కార్డులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యా ల, ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 7,44,361 రేషన్ కార్డులు ఉన్నా యి. ఇందులో నిర్మల్ జిల్లాలో 12,468 అంత్యోదయ, 1,91,790 ఆహార భద్రత, 34 అన్నపూర్ణ కార్డులు ఉండగా, మొత్తం 2,04,292 రేషన్ కార్డులు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 1,88,491 కార్డులు ఉండగా 14,033 అంత్యోదయ, 1,74,186 ఆహార భద్ర తా, 272 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో 2,14,268 రేషన్ కార్డులు ఉండగా అందులో 15,419 అంత్యోద య, 1,98,670 ఆహార భద్రతా, 170 అన్నపూర్ణ కార్డులు ఉన్నా యి. ఆసిఫాబాద్ జిల్లా లో 1,37,310 రేషన్ కార్డులు ఉండగా, ఇందులో 12,948 అంత్యోదయ, 1,24,340 ఆహార భద్రతా, 22 అన్నపూర్ణ కార్డులు ఉన్నా యి. ప్రతి నెల రేషన్ కార్డులోని ఒక్కో వ్య క్తికి 6 కిలోల బియ్యం అందిస్తున్నారు.అంత్యోదయ కార్డు దారులకు నెలకు 35 కేజీల బియ్యం, అన్నపూర్ణ కార్డు లబ్ధిదారులకు 10 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం అందజేస్తున్నది. లాక్డౌన్ సమయంలో ప్రభు త్వం ఉచితంగా 12 కిలోల రేషన్ బియ్యాన్ని అందజేసింది.
తొలగనున్న ఇక్కట్లు
జిల్లాలో వేలిముద్రలు, ఐరిస్ ద్వారా కంటి ముద్రలు పడకపోవడంతో వృద్దులు రేషన్ దుకాణాల మందు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ ఓటీపీ నిర్ణయంతో పండుటాకులతో పాటు ఇతరులకు కూడా ఇబ్బందులు తొలగనున్నాయి. లబ్ధిదారుడు రేషన్ దుకాణానికి వెళ్లినప్పుడు అతని రేషన్ కార్డు నంబర్‌ను నమోదు చేయగానే మూడు ఆప్షన్లను అడుగుతాయి. ఇందులో బయోమెట్రిక్, ఐరిష్, ఓటీపీ ఇలా మూడింటిలో ఏదైనా ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం ఉంది. ఓటీపీ ఆప్షన్‌ను ఎంచుకునే లబ్ధిదారుడు తన ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ చేసుకున్న వారికి ఓటీపీ వస్తుంది. ఓటీపీని నమోదు చేయగానే డీలర్లు రేషన్ సరుకులను అందించనున్నారు.
మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలి
వేలి ముద్రలు, ఐరిస్ పడకుండా ఇబ్బందులు పడుతూ థర్డ్‌పార్టీ ద్వారా రేషన్ పొందుతున్న లబ్ధిదారులు ఇకపై ఓటీపీతో సరుకులను తీసుకోవచ్చు. గతంలో బయోమెట్రిక్, ఐరిష్ రాని వారికి వీఆర్ఏ, వీఆర్వోల ద్వారా రేషన్ డీలర్లు సరుకులు పంపిణీ చేసేవారు.వచ్చే నెల నుంచి వేలిముద్రలు సరిగ్గాలేని లబ్ధిదారులకు ప్రభుత్వం ఓటీపీ ద్వారా రేషన్ సరుకులను అందించనుంది. ఈనూతన విధానం ద్వారా బియ్యం పారదర్శకంగా లబ్ధిదారులకు చేరడంతో పాటు థర్డ్ పార్టీలపై ఆధారపడే అవకాశం ఉండదు. ఓటీపీ ద్వారా రేషన్ పొందేవారు ఆధార్‌కు మొబైల్ నంబర్‌ను వెంటనే లింక్ చేసుకోవాలి.
-కిరణ్ కుమార్, నిర్మల్ డీఎస్వో
నిర్మల్ పట్టణంలోని ఓ వార్డుకు చెందిన వృద్ధురాలు లక్ష్మి 40 ఏండ్లుగా బీడీలు చుడుతూ ఉపాధి పొందుతున్నది.. రేషన్ తీసుకునేందుకు డీలర్ వద్దకు వెళ్తే చాలాసార్లు బయోమెట్రిక్ ముద్రలు పడకపోవడం, ఐరిస్ సపోర్టు చేయకపోవడంతో ప్రతిసారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేది. వీఆర్ఏ, వీఆర్వోలు వచ్చినప్పుడే అక్కడికి వెళ్లి రేషన్ తీసుకునేది. రేషన్ సరుకులు వచ్చినయంటే దుకాణానికి తిరుగుతూ ఇబ్బందులు పడేది. ఇలా ఒక్క లక్ష్మి మాత్రమే కాదు. దాదాపు 20-50 మందిది ఇదే పరిస్థితి. ప్రభుత్వం తీసుకువచ్చిన ఓటీపీ విధానంతో ఇలాంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి.
తాజావార్తలు
- రాష్ర్టంలో కరోనా టీకా తీసుకున్న తొలి మహిళ ఈమెనే
- చనిపోయిన పెంపుడు శునకానికి ఎంత గొప్ప సంస్కారం..!
- రష్యా ఎస్-400 మిస్సైల్ కొనుగోళ్లపై అభ్యంతరం
- లాక్‌డౌన్‌తో ప్రాణాలను కాపాడుకున్నాం : ప్రధాని మోదీ
- తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
- కరోనా ఖతం.. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోదీ
- దేశంలో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు
- రాష్ర్టంలో కొత్తగా 249 కరోనా కేసులు
- రోహిత్ శర్మ ఔట్.. ఇండియా 62-2
- హార్ధిక్ పాండ్యా తండ్రి కన్నుమూత..