సోమవారం 25 జనవరి 2021
Nirmal - Oct 06, 2020 , 00:12:40

ఆల్బెండజోల్‌ మాత్రలు వేయించాలి

ఆల్బెండజోల్‌ మాత్రలు వేయించాలి

నిర్మల్‌ టౌన్‌: జిల్లాలో 1-19 ఏళ్లలోపు పిల్లలందరికీ నులి పురుగుల నివారణ  మాత్రలు వే యాలని నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫా రూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ లో మాత్ర ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవా రం ప్రారంభించారు. రాం నగర్‌ పీహెచ్‌సీలో పలువురు పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వసంత్‌రావు, జిల్లా టీకాల అధికారి అవినాశ్‌, వైద్య సిబ్బంది వేణుగోపాల్‌రావు, రమణ, రవీందర్‌, కౌన్సిలర్‌ సలీం పాల్గొన్నారు. 

దసరాలోపు వేదికలు పూర్తి చేయాలి

దసరా లోపు రైతు వేదికల పనులు పూర్తి చేయాలని నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫా రూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం సమావేశం నిర్వహించారు. ప నుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ ఇప్పటివరకు 10 లోపు వేదికల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 15 రోజుల్లో 100 శాతం పూర్తి చేయాలని సూచించారు. అనంతరం పల్లె ప్రగతి పనులపై ఎంపీడీవోలతో సమీక్షించారు. అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్‌, డీఆర్డీవో వెంకటేశ్వ ర్లు, పం చాయతీరాజ్‌ ఈఈ సుదర్శన్‌రావు, అధికారులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌ నమోదు పరిశీలన

లోకేశ్వరం : మండలంలోని అర్లి, గొడిసెర గ్రా మాల్లో జరుగుతున్న ఆన్‌లైన్‌ ప్రక్రియను కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ పరిశీలించారు. స్వయంగా తానే కొందరి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇండ్లు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల ఆలయాలు, మసీదులు, చర్చిలు అన్ని భూ ముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ప్రజలు వ్యవసాయేతర వివరాలను స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలని కోరా రు. తహసీల్దార్‌ వెంకటరమణ,  ఎంపీడీవో క్రాంతికుమారి, సర్పంచ్‌ భోజవ్వ, ఎంపీటీసీ దత్తురాం, ఎంపీవో వెంకటరమణయ్య, పీఆర్‌జేఈ రఘువంశీ, గ్రామస్తులున్నారు. 


logo