మిషన్ భగీరథతో గిరిజన గూడేలకు శుద్ధజలం

- n ఇంటింటికీ నల్లాల ద్వారా రక్షితనీరు సరఫరా
- n సీఎం కేసీఆర్ చలువతోనే మారుమూల గ్రామాలకు నీరు
- n తగ్గుముఖం పట్టిన డయేరియా, టైఫాయిడ్
- n దశాబ్దాల సమస్యకు సర్కారు పరిష్కారం
కుమ్రం భీం ఆసిఫాబాద్/ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ : ఆదిలాబాద్ జిల్లాలో యేటా వానకాలంలో కలుషిత నీటిని తాగి గిరిజనులు వివిధ రకాల వ్యాధుల బారిన పడేవారు. డయేరియా, ఇతర విషజ్వరాలు ప్రజలను పట్టి పీడించేవి. గ్రామాలు విషజ్వరాలతో మంచం పట్టేవి. ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం జిల్లావాసులకు స్వచ్ఛజలం అందిస్తున్నది. రెండేండ్లుగా శుద్ధజలం లభిస్తున్నది. మిషన్ భగీరథ పథకంలో భాగంగా అధికారులు గ్రీడ్ పైపులైన్ 1,990.90 కిలోమీటర్లు, ఇంట్రా పైపులైన్ 1,761 కిలోమీటర్లు వేశారు. జిల్లా వ్యాప్తంగా 1,73, 283 నల్లా కనెక్షన్లు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 1,211 గ్రామాలకు మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్నది. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 735 గ్రామాలకు, కుమ్రం భీం ప్రాజెక్టు ద్వారా 491 గ్రామాలకు తాగునీరు అందుతున్నది. రోజుకు ఆరు కోట్ల లీటర్ల మంచినీటిని అధికారులు ప్రజలు తాగేందుకు సరఫరా చేస్తున్నారు. ఫలితంగా రక్షిత నీటిని తాగుతున్న ప్రజలు కలుషితనీటి కారక వ్యాధుల నుంచి విముక్తి పొందారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,057 గ్రామాలకు నీటి సరఫరా
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 1,151 గ్రామాలకు మిషన్ భగీరథ నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటివరకు సర్కారు 1,057 పల్లెలకు సరఫరా చేస్తున్నది. ఇందుకోసం రూ.1,865 కోట్లు ఖర్చు చేసింది. నీటి సరఫరా కోసం 848 ట్యాంకులు నిర్మించింది. దీనికోసం 1,233 కిలోమీటర్ల పైపులైన్‌కు 1,209 కిలోమీటర్ల పైపులైన్ వేసింది. 10 టీఎంసీల సామర్థ్యం గల కుమ్రం భీం ప్రాజెక్టు నుంచి 1.703 టీఎంసీల నీటిని గిరిజన గ్రామాలకు సరఫరాతో దాదాపు అక్కడశుద్ధజలం సమస్య తీరిపోయింది. జిల్లాలో 75 ప్రాంతాల్లో ఫిల్టర్బెడ్లు నిర్మించారు. యేటా కలుషిత నీటితో రోగాల బారిన పడే ప్రజలకు విముక్తి లభించింది.
మా గ్రామాలకు నీళ్లొస్తున్నయ్..
మాది గిరిజన గ్రామం. కొత్తగా తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసింది. 220 ఇండ్లలో 90 శాతం కొలాం గిరిజన కుటుంబాలే ఉంటాయి. మా ఊరిలో ఒక్కటే బోరు ఉంది. దశాబ్దాలుగా ఇదే బోరు నీరు తాగుతున్నం. మా ఊరు, సమీప ప్రాంతాల్లో రాళ్లు అధికంగా ఉండడంతో బోర్లు, బావులు తవ్వడం చాలా కష్టం. సర్కారు అందిస్తున్న మిషన్ భగీరథ నీరు బాగుంది. ఇంటింటికీ నీళ్లు వస్తున్నయ్. చాలా సంతోషం.
- ఆత్రం లలిత, సర్పంచ్, గుంజాల, భీంపూర్ మండలం
ఇంటింటికీ శుద్ధజలం
పంచాయతీ కేంద్రం కరంజి(టి), అనుబంధ గిరిజన గ్రామం రాజులవాడికి భగీరథ శుద్ధజలం అందుతున్నది. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చారు. గతంలో మైళ్ల దూరం నడిచి నీరు తెచ్చుకునేటోళ్లం. కష్టం తప్పింది. సమయం కూడా ఆదా అవుతున్నది. ట్యాంకులను కనీసంగా 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయిస్తున్నం. నీటిని క్లోరినేషన్ చేస్తున్నం. ఈ యేడాది వ్యాధులు మా గ్రామంలోని వారికి రాలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే భగీరథ నీరు ఆర్యోగం కలిగిస్తున్నది.
- గుర్ల స్వాతిక, సర్పంచ్, కరంజి(టి), భీంపూర్ మండలం
తాజావార్తలు
- యూజీ ఆయుష్ వైద్య విద్య నీట్ అర్హత కటాఫ్ మార్కుల తగ్గింపు
- టీఆర్పీ స్కాం: ఐసీయూలో బార్క్ మాజీ సీఈవో
- 'వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి'
- ఆ షాట్ ఏంటి?.. రోహిత్‌పై గావస్కర్ ఫైర్
- బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి అదనపు మాప్ అప్ కౌన్సెలింగ్
- కష్టపడకుండా బరువు తగ్గండి ఇలా?
- అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
- నిర్మలమ్మకు విషమపరీక్ష: ఐటీ మినహాయింపులు పెరిగేనా?!
- రన్‌వేపైకి దూసుకెళ్లిన కారు.. ఒక వ్యక్తి అరెస్ట్
- భారత అభిమానిపై జాత్యహంకార వ్యాఖ్యలు