ఆదివారం 17 జనవరి 2021
Nirmal - Jul 19, 2020 , 02:30:42

హరితహారంలో భాగస్వాములవ్వాలి

హరితహారంలో భాగస్వాములవ్వాలి

భైంసా : హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని భైంసా మున్సిఫ్‌ కోర్టు న్యాయమూర్తి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. కోర్టు ఆవరణలో లాయర్లతో కలిసి శనివారం మొక్కలు నాటారు. రోజు రోజుకూ పెరుగుతున్న కాలుష్యంతో భూ వాతావరణంలోని ఓజోన్‌ పొర క్షీణిస్తున్నదని తెలిపారు. దీంతో నేరుగా సూర్యకిరణాలు భూమిపై పడి మానవాళికి ముప్పు ఏర్పడుతుందని చెప్పారు. దీని నివారణకు విరివిగా మొక్కలు నాటాలని, అడవులను సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సీ శంకర్‌, డీఈ రవీందర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

తానూర్‌ : మండలంలోని ఎల్వీ గ్రామస్తులకు మొక్కలను ఎంపీటీసీ పద్మ పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి గ్రామాన్ని హరితవనంగా మార్చాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ అంజనాబాయి, గ్రామ కార్యదర్శి రవికాంత్‌రెడ్డి, ఐకేపీ సీఏ అన్నపూర్ణ, నాయకులు సుదర్శన్‌ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

దిలావర్‌పూర్‌ : హరితహారంతో గ్రామాలన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయని ఎంపీపీ ఏలాల అమృత పేర్కొన్నారు. మండలంలోని గుండంపల్లి గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలకు సర్పంచ్‌ సంగీత,  ఐకేపీ అధికారులు పంపిణీ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటి రక్షించాలని సూచించారు. అనంతరం గ్రామంలో మొక్కలు నాటా రు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తక్కల రమణారెడ్డి, జిల్లా రైతు బంధు సమితి సభ్యుడు ఏలాల చిన్నారెడ్డి, ఐకేపీ అధికారులు ముత్యం, సాయన్న కారోబార్‌, రాజారెడ్డి, పంచాయతీ కార్యదర్శి స్వాతి, తదితరులు పాల్గొన్నారు.