బుధవారం 12 ఆగస్టు 2020
Nirmal - Jul 11, 2020 , 00:21:12

పల్లె ప్రగతి పనులను వేగంగా పూ ర్తి చేయాలి

పల్లె ప్రగతి పనులను వేగంగా పూ ర్తి చేయాలి

నిర్మల్‌ టౌన్‌: పల్లె ప్రగతి పనులను వేగంగా పూ ర్తి చేయాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పల్లె ప్రగతి పనులపై జిల్లా అధికారులు, ఎంపీడీవోలతో శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిం చారు. పల్లె ప్రగతి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నదని, పను ల్లో నిర్లక్ష్యం వహించవద్దని పేర్కొన్నారు. గ్రామాల్లో  నిర్మిస్తున్న శ్మశానవాటికలు, సెగ్రిగేషన్‌ షెడ్డు, హరితహారంలో మొక్కలు నాటడం, ఇంకుడుగుంతలు, ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు పాటించాలని సూచించారు. ప్రతి రో జూ అధికారులు పనులను పర్యవేక్షించి ప్రగతి నివేదికలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, డీపీవో శ్రీనివాస్‌, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌, పలువురు అధికారులు ఉన్నారు. 

నిర్మల్‌ టౌన్‌: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా అన్ని గ్రామాల్లో నిర్వహిం చే అభివృద్ధి కార్యక్రమాల ఐదేళ్ల వార్షిక ప్రణాళికను పకడ్బందీగా రూపొందించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. త్వరలో జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం రానున్నదని పేర్కొన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో మాస్టర్‌ ట్రైనర్లకు జీఐఎస్‌ సిస్టంపై శుక్రవారం నిర్వహించిన శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ, జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పల్లెల్లో నిర్వహిస్తున్న పనులను పారదర్శకంగా అమలు చేసేందుకే ఈ విధానం అమల్లోకి రాబోతున్నదన్నారు. గ్రామాల్లో ఇప్పటివరకు చేపట్టిన పనులు, చేపట్టాల్సిన పనులను గుర్తించనున్నట్లు వివరించారు. ఐదేళ్ల వార్షిక ప్రణాళిక ఆధారంగానే నిధులు మంజూరయ్యే అవకాశం ఉన్నందున మాస్టర్‌ ట్రైనర్లు సిస్టంలో అన్ని వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఇక్కడ అధికారులు ఉన్నారు. 


logo