శుక్రవారం 23 అక్టోబర్ 2020
Nipuna-education - Sep 20, 2020 , 07:22:22

రేప‌టి నుంచి ఎడ్‌సెట్ హాల్‌టికెట్లు.. వచ్చే‌నెల 1, 3న ప‌రీక్ష‌

రేప‌టి నుంచి ఎడ్‌సెట్ హాల్‌టికెట్లు.. వచ్చే‌నెల 1, 3న ప‌రీక్ష‌

హైద‌రా‌బాద్‌: బీఈడీ కాలే‌జీల్లో ప్రవే‌శాల కోసం నిర్వ‌హిం‌చే ఎడ్‌‌సెట్‌–2020  హాల్‌టికెట్ల‌ను రేప‌టి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని ఉస్మానియా యూనివ‌ర్సిటీ ప్ర‌క‌టించింది. విద్యార్థులు హాల్‌టికెట్ల‌ను ప‌రీక్ష స‌మ‌యం వ‌ర‌కు అధికారిక వెబ్‌సైట్ https://edcet.tsche.ac.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. 

ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ల‌ను అక్టో‌బర్‌ 1, 3 తేదీల్లో నిర్వహిస్తామ‌ని తెలిపింది. వ‌చ్చేనెల 1న మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు, అక్టో‌బర్‌ 3న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 వరకు రెండు విడ‌త‌ల్లో పరీక్ష జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించింది. ఎడ్‌సెట్‌-2020ని ఉస్మానియా యూనివ‌ర్సిటీ నిర్వ‌హిస్తున్న‌ది.   


logo