TS Weather | ఈ నెల 18 వరకు తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్లో వర్షాలు కురిసే వానలు పడుతాయని గంటకు 40-50 కిలోమీటర్ల గాలులు వీచే అవకాశాలున్నాయని చెప్పింది.
అలాగే, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డికి వానలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. 17న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. 18న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వానలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇవాళ ఉదయం ఖమ్మం, వనపర్తి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదైందని టీఎస్డీపీఎస్ వివరించింది.