DOST 2024 | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇంటర్ పాసైన విద్యార్థులు రూ. 200 ఫీజు చెల్లించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మే 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. కానీ ఈ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. విద్యార్థులు గమనించాలని అధికారులు సూచించారు. జూన్ 3న మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. రాష్ట్రంలోని 1066 కాలేజీల్లో మొత్తం 4,49,449 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మూడు విడతల్లో దోస్త్ ప్రక్రియను పూర్తిచేస్తారు.