హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలో 2025-26 విద్యాసంవత్సరానికి పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఆదిలాబాద్ జిల్లాలోని దస్నాపూర్, పెద్దపల్లి జిల్లా రామగిరిఖిల్లా, నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్, సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలోని హార్టికల్చర్ పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నెల 26 వరకు దరఖాస్తులు సమర్పించాలని రిజిస్ట్రార్ భగవా న్ సూచించారు. వివరాల కోసం ఉద్యాన వర్సిటీ వెబ్సైట్ www.skltghu.ac.in ను సందర్శించాలని లేదా 96032 68682, 91215 57037, 93981 66973, 70751 20145 నంబర్లను సంప్రదించవచ్చని రిజిస్ట్రార్ తెలిపారు.