TS ICET 2025 | నల్గొండ విద్యా విభాగం (రామగిరి) మార్చ్ 6 : తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ఐసెట్-2025 ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ వచ్చేసింది. ఇవాళ నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, టీఎస్ ఐసెట్ కన్వీనర్, ఎంజీయూ రిజిస్ర్టార్ ప్రొఫెసర్ అల్వాల రవిలు విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి సహకారంతో నల్గొండ నుండి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే టీఎస్ ఐసెట్ 2025-26 ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 10న ప్రారంభమై మే 3 తో ముగుస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.
సంబంధిత అర్హత కలిగిన విద్యార్థులంతా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంజీయూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ జి ఉపేందర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఆడిట్ డాక్టర్ వై ప్రశాంతి, ఇన్ఫాస్ట్రక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆకుల రవి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంబీఏ అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ మిర్యాల రమేష్ కుమార్, డాక్టర్ లక్ష్మీప్రభ ,డాక్టర్ శ్వేత, డాక్టర్ జే.సురేష్ రెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ అరుణప్రియ, కామర్స్ విభాగం ప్రొఫెసర్లు సరిత శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోవాలి- టీఎస్ ఐసెట్ కన్వీనర్, ప్రొఫెసర్ అల్వాల రవి
నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే టీఎస్ఐసెట్ అర్హత పరీక్ష నోటిఫికేషన్లు విడుదల చేశాం. అర్హులైన విద్యార్థులంతా నిర్దేశిత గడువులోగా దరఖాస్తులు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలి. గతంలో తెలంగాణ వ్యాప్తంగా ఎంజీయూ ఆధ్వర్యంలో TSPECET, TSEdCET విజయవంతంగా నిర్వహించి అడ్మిషన్ల ప్రక్రియ చేశాం. దానితో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ పర్యాయం TS ICET-2025 నిర్వహణ బాధ్యత మాకు అప్పగించారు. ఎవరికి నష్టం జరుగకుండా నిబంధనల మేరకు పరీక్ష నిర్వహించి ఫలితాలను విడుదల చేస్తాం.
షెడ్యూల్ ఇలా..
* ఈనెల 10 నుంచి మే 3 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు
* రూ 250 రూపాయలు అపరాధ విషయంతో మే 17 వరకు అవకాశం
* రూ 500 రూపాయల అపరాధ రుసుముతో మే 26 వరకు అవకాశం
* ఆన్లైన్లో చేసిన దరఖాస్తులలో పొరపాట్లు ఉంటే మే 16 నుంచి 20 వరకు వాటిని సరిచేసుకునే అవకాశం కల్పించారు.
పరీక్ష నిర్వహణ..
* ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష..
* 4 షిఫ్టులలో రాష్ట్రవ్యాప్తంగా 16 (CBT) విధానంలో ఆన్లైన్ పరీక్ష కేంద్రాలలో జూన్ 8, 9 తేదీల్లో పరీక్ష ఉంటుంది.
పరీక్ష సమయం ఇలా…
* ప్రతీరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 :30 గంటలకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
* జూన్ 21న పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేస్తారు
* జూన్ 22 నుంచి 26 వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.
* జులై 7న ఫలితాలను విడుదల చేస్తారు.
S Jaishankar | అధిక సుంకాలతో భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి.. జై శంకర్ ఏమన్నారంటే..?
Bandlaguda Jagir | చెత్త బండ్లగూడ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై పట్టింపేది?
Janhvi Kapoor| రామ్ చరణ్ కొత్త సినిమా నుండి జాన్వీ లుక్ రిలీజ్.. ఒక్కసారిగా పెరిగిన అంచనాలు