హైదరాబాద్, సెప్టెంబర్24 (నమస్తే తెలంగాణ) : అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కోసం ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎస్సీ సంక్షేమశాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు. వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ట్రిపుల్ఆర్ భూ నిర్వాసితులు, రైతులతో వచ్చేనెల 5న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ పేర్కొన్నారు. 163 గ్రామాల్లోని రైతులు వారి భూములు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. 26 వరకు ప్రభావిత గ్రామాల్లో పర్యటించి, 27న 8జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన చేపడుతామని బుధవారం ఎంబీభవన్లో వెల్లడించారు.