KTR |జీవో 97 కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నల్గొండలో పాలిటెక్నిక్ విద్యార్థులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ సమస్యలను చెప్పగా.. కేటీఆర్ మీకు మేమున్నామంటూ భరోసానిచ్చారు.
కేటీఆర్ విద్యార్థులతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ మొదలవుతుంది.. మీ సమస్యనే మొదటి ప్రాధాన్యతగా తీసుకుంటాం. ప్రభుత్వం ముందుకొచ్చి మీ సమస్యపై స్పష్టత ఇచ్చే దాకా వదిలిపెట్టం. వాళ్లు మీ పాలిటెక్నిక్ కాలేజీల భూములు ఎక్కడెక్కడైతే ఉన్నయో ఆ భూముల మీద కన్నేశారు. ఆ భూములు అమ్ముకోవడానికే ఈ డ్రామా. రేవంత్ రెడ్డికి తెలిసిందల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారమే కాబట్టి ఆయనకు వేరే ఎజెండా ఏం లేదు.. మీ పాలిటెక్నిక్ కాలేజీల కిందున్న భూములు ఎత్తుకొని పోవాలి. అందులో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉండే భూములు ఎత్తుకొని పోవాలి… దానికి లింక్ పెట్టి మిమ్మల్ని అందరినీ ఆగం చేస్తా ఉన్నడు. మాకు తిండి లేదు ఏం లేదు సార్ అని విద్యార్థులు అంటుంటే.. మాకొదిలి పెట్టండి.. వాళ్ల ప్రపోజల్ ముందుకు పోకుండా చూసుకునే బాధ్యత మాదని కేటీఆర్ హామీనిచ్చారు.
పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా కేటీఆర్ భరోసా
నల్గొండలో జీవో 97 కారణంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై కేటీఆర్‌కు వినతిపత్రం అందజేసిన పాలిటెక్నిక్ విద్యార్థులు
అసెంబ్లీలో పాలిటెక్నిక్ విద్యార్థుల తరపున పోరాటం చేస్తామని, జీవో 97 ఎత్తివేసేవరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని భరోసా… https://t.co/02GtpWySwJ pic.twitter.com/TRdOtm0yVd
— Telugu Scribe (@TeluguScribe) September 3, 2026
Rashmika | భర్త విజయ్‌తో మూడు నెలల తర్వాత ఫుల్ క్వాలిటీ టైమ్.. నేచరే ఇలా చేసిందేమో ..
ACB | సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య నివాసంలో ఏసీబీ మెరుపు దాడులు