చుంచుపల్లి, సెప్టెంబర్ 03 : కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని పేర్కొంటూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఏడు రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా గురువారం చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ బైపాస్ వద్ద రైతు సదస్సు నిర్వహించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సదస్సు నిర్వహించినట్లు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ముఖ్యంగా రైతు బీమా, యూరియా–విత్తనాల సరఫరా, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, సొసైటీ డైరెక్టర్ వేల్పుల మల్లేష్ యాదవ్, సీనియర్ నాయకులు తోగారు రాజశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాజేష్, సర్పంచులు బలరాం, శ్రీకాంత్ నాయక్, రాందాస్ నాయక్, ఉప సర్పంచ్ రతన్ నాయక్తో పాటు మాజీ సర్పంచులు ధనలక్ష్మి, మోతి, గుమ్మడి సాగర్, రంగరాజు రాజేశ్, శ్రీకాంత్ యాదవ్, నవతన్, రామంచి శ్రీనివాస్, బోనగిరి శ్రీకాంత్, తాతారావు, కలకోటి ఐలయ్య, కంటే రవి, మాలోత్ రాజా, శ్రీహరి, సంకుబాపన అనుదీప్, దూర్గేష్ పాల్గొన్నారు.

‘రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలి’