హైదరాబాద్ : మొయినాబాద్ ఫామ్ హౌస్లో యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామ శివారులోని వ్యాస ఫామ్ హౌస్లో జరిగిన బర్త్డే పార్టీలో ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి పాల్గొన్నాడు. అయితే స్విమ్మింగ్ పూల్లో పడి సదరు యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
వాచ్ మెన్ సోమవారం ఉదయం గమనించి స్నేహితులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. మృతుడు హైదరాబాద్ మజీద్ బండకు చెందిన యాక్సిస్ బ్యాంక్ సెకూరిటీ గార్డ్ సాయి(28)గా గుర్తించారు. పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.