యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు ఆదివారం రూ.16,30,808 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,79,750, రూ.100 దర్శనం టిక్కెట్ల ద్వారా 28,200, వీఐపీ దర్శనాల ద్వారా 1,50,000, వేద ఆశీర్వచనం ద్వారా 5,160, నిత్యకైంకర్యాల ద్వారా 1,600, సుప్రభాతం ద్వారా 100, క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా 4,000, టెంకాయల విక్రయాల ద్వారా 60,000, వ్రత పూజలతో 55,000, కల్యాణ
కట్ట టిక్కెట్ల ద్వారా 32,800, ప్రసాద విక్రయాల ద్వారా 6,03,285, వాహన పూజలతో 24,200, టోల్గేట్ ద్వారా 2,210, అన్నదాన విరాళాల ద్వారా 19,232, సువర్ణ పుష్పార్చన ద్వారా 1,23,100, యాదరుషి నిలయం ద్వారా 85,300, పాతగుట్ట నుంచి 32,025, గోపూజ ద్వారా 150, ఇతర విభాగాల ద్వారా 2,07,000 మొత్తంగా శ్రీవారి ఖజానాకు రూ. 16,30,808 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.