Dubbaka Municipality | మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడగా.. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోరాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల్లో గెలుపొందిన ఇండిపెండెంట్ కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
తాజాగా దుబ్బాక మున్సిపాలిటీ 17వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ ఎండీ చాంద్ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.