Hardik Pandya : ప్రేమికుల రోజున ఒక్కొక్కరు ఒక్కోలా తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. కొందరు కానుకలతో.. మరొకందరు పర్యటనలతో తమ ఇష్ట సఖిని ఆశ్చర్యపరుస్తారు. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సైతం అందరి ప్రేమికుల్లానే తన ప్రేమను చాటుకున్నాడు. పచ్చబొట్టు సాక్షిగా తమ అనుబంధం ఎంత ద్రుఢమైనదో నిరూపించాడు. కొన్నిరోజులుగా మహీకా శర్మ (Maheeka Sharma)తో రొమాన్స్ చేస్తున్న ఈ ఆల్‌రౌండర్ ఆమె పేరులోని మొదటి అక్షరం ఎమ్ వచ్చేలా మెడపై టాట్టూ వేయించుకున్నాడు.
పాండ్యా, మహీకా శర్మలు గతేడాది నుంచి రిలేషన్షిప్లో ఉన్నారు. పలు సందర్భాల్లో ఇద్దరూ జంటగా కనిపించారు కూడా. ప్రేమికుల రోజు సందర్భంగా పాండ్యా తన ప్రేమను వ్యక్త పరుస్తూ మెడపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఏలియన్స్ టాట్టూ స్టూడియోలో.. అతడు మెడపై రెండు చిరుత పులుల బొమ్మలను టాట్టూగా వేసుకున్నాడు. వాటిపై తన ప్రేయసి మహీకా పేరులోని మొదటి అక్షరం ఎమ్ వచ్చేలా చూసుకున్నాడు. ఆ ఫొటోను షేర్ చేస్తూ నువ్వూ నేను ఒకటే.. మన బంధం ఎంతో ద్రుఢమైనది అని చాటాడు టీమిండియా స్టార్.
ప్రేమికుల రోజును పునస్కరించుకొని హార్దిక్ పాండ్యా ఒక ఐడియాతో వచ్చాడు. మహీకా, తాను ఒకరికొకరం కొండంత బలమని అతడు చెప్పాడు. పాండ్యా మాటలు విన్నాక.. వారి అనుబంధాన్ని ప్రతిబింబించేందుకు చిరుతపులి సరైంది అనిపించింది. ఒంటరిగా అది శక్తివంతమైంది. ఇక జంటగా అయితే.. చిరుతను ఆపలేం. అందుకే.. వారి ప్రేమకు సాక్షంగా ఈ టాట్టూ వేశాం అని ఏలియన్స్ టాట్టూ వ్యవస్థాపకుడు సన్నీ భనుషాలి తెలిపాడు.
ఇటీవలే గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్‌పై చెలరేగాడు. ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లోనూ అతడు రఫ్ఫాడిస్తున్నాడు. తాను పునరాగమనం చేయడంలో మహీక పాత్ర ఉందని చెప్పాడు పాండ్యా. మనల్ని గాయాలు మానసికంగా పరీక్షిస్తాయి. మెదడులో ఎన్నో సందేహాలకు తావిస్తాయి. మనం త్వరగా కోలుకుని పునరాగమనం చేయడంలో మనల్ని ఇష్టపడే వాళ్ల పాత్ర చాలా ఉంటుంది. నా జీవితంలోకి మహీక వచ్చాక ఎన్నో గొప్ప విషయాలు జరిగాయి అని పాండ్య వెల్లడించాడు. లీగ్ దశ రెండో మ్యాచ్ కోసం జట్టుతో పాటు కొలంబో చేరుకున్న పాండ్య.. ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌పై సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.
🚨🚨Hardik Pandya has a unique AURA in the Indian team. The BCCI doesn’t allow all players to have their wives or fiancées with them. No one even took their wives or fiancées with them.
But Hardik Pandya took his fiancée, Mahieka Sharma, with him to Sri Lanka. Now, it’s possible… pic.twitter.com/fICVV0vTmQ
— Shanu (@Shanu_3010) February 14, 2026