Xiaomi – Samsung | భారత్ రిటైల్ మార్కెట్‌పై ఫోకస్ చేస్తున్నది చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై ఏండ్ల తరబడి పోరాటం తర్వాత పై చేయి సాధించిన షియోమీ.. రిటైల్ ఔట్‌లెట్స్‌లో సేల్స్ పెంచుకోవడంతోపై ఫోకస్ చేస్తున్నది. షియోమీతో పోలిస్తే దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ వెనక బడింది.
కొన్నేండ్లుగా భారత్‌లో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ సేల్స్ పెరిగాయి. తద్వారా షియోమీ ఇతర స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలకు ప్రపంచంలోకెల్లా శరవేగంగా పెరుగుతున్న అతిపెద్ద మార్కెట్ భారత్‌లో విస్తరణకు మార్గం చూపాయి. భారత్‌లో ప్రస్తుతం 60 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉన్నారు. కానీ, ఇప్పటికీ భారత్ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో ఆన్ లైన్ సేల్స్ 44 శాతమే. ఇప్పటికీ రిటైల్ మార్కెట్‌దే పై చేయి.
ఆన్లైన్ మార్కెట్‌తో పోలిస్తే ఆఫ్ లైన్ సేల్స్‌లో గణనీయంగా వెనుకబడి ఉన్నామని షియోమీ ఇండియా ప్రెసిడెంట్ బీ మురళీక్రుష్ణన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇతర పోటీదారులు గల ఆఫ్ లైన్ మార్కెట్లో పారదర్శకంగా వ్యవహరిస్తున్నవారు పెద్ద మార్కెట్ వాటా కలిగి ఉన్నారన్నారు.
రిటైల్ సేల్స్‌లో షియోమీ వాటా 34 శాతం.. అదే శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు రిటైల్ స్టోర్లలో 57 శాతం ఉంటాయని హాంకాంగ్ కేంద్రంగా పని చేస్తున్న కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఇతర రిటైల్ స్మార్ట్ ఫోన్ స్టోర్ల వెండార్లతో సేల్స్ భాగస్వామ్యం పెంచుకోవడానికి షియోమీ ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 18 వేల యూనిట్లు కలిగి ఉంది. స్మార్ట్ ఫోన్లతోపాటు టీవీలు, సెక్యూరిటీ కెమెరా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా రిటైల్ మార్కెట్లోకి తెస్తామన్నారు మురళీక్రుష్ణన్.