Bodhan | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని శ్రీ సత్య సాయి బాబా మందిరంలో గురువారం ఆరాదన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్య సాయి బాబా శివైక్యం చెంది 14 సంవత్సరాలైన సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున స్వామివారి చిత్రపటానికి పూలమాలలతో అలంకరించి భజనలు, ప్రత్యేక పూజలుచేశారు. మధ్యాహ్నం ఆలయం ఎదుట సుమారు 100 మందికి పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
శ్రీ సత్య సాయి సేవా సదన్ బోధన ఆధ్వర్యంలో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సత్య సాయి సేవ సమితి ప్రతినిధులు తెలిపారు. ప్రతీ ఏటా వేసవికాలం సందర్భంగా ఆలయం ఎదుట చలివేంద్రాన్ని కొనసాగిస్తూ ఇందులో మజ్జిగ పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమాలు అనంతరం ఆలయంలో అన్నప్రసాద వితరణ జరిపించారు. ఈ కార్యక్రమంలో సత్య సాయి సేవా సమితి కన్వీనర్ గోపాల్ రెడ్డి, కోకన్వీనర్ లక్ష్మీకాంత్ రెడ్డి, సేవా సమితి ఇన్చార్జ్ జగన్నాథ శర్మ, మహిళా కన్వీనర్ నాగమణి, ప్రతినిధులు కిషోర్, అశోక్, శంకర్, హేమలత, పద్మ, సూర్య కుమారి తదితరులు తమ సేవలను అందించారు.